<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
   నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
   తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
   తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2) // ఆశ్చర్యకరుడు //

[V1]
 తన చేతిలో రోగాలు లయమైపోయెను
 తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
 తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
 నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2) // ఆశ్చర్యకరుడు //

[V2]
 మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
 మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
 తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
 తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2) // ఆశ్చర్యకరుడు //</lyrics>
<title>ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త</title>
<hymn_number>24</hymn_number>
</song>